Friday, September 8, 2017

how to reduce wrinkles on face naturally in telugu


how to reduce wrinkles on face naturally in telugu
Hello Viewers Wellcome To MMS DESIGNER.
ముఖ చర్మంపై ముడతలు, సన్నని గీతాలు లేదా చర్మం సాగటం వంటివి వృద్దాప్యంలో సహజంగా కలిగే చర్మ రుగ్మతలు. కానీ, మీ కన్నా చిన్న వయసులో ఉన్న మహిళతో పోలిస్తే, మీ చర్మంపై అధికంగా ఉంటే అది మిమ్మల్ని చాలా భాధకు గురి చేస్తుంది. నిజానికి మీ అనారోగ్యానికి తెలిపే ఒక సమస్య మరియు వృద్దాప్యం మాత్రమే కాదు చాలా రకాల కారకాలు చర్మంపై ముడతలను కలిగిస్తాయి. అవును వయసు కాకుండా, చర్మంపై ఇతర కారణాల వలన కూడా చర్మ ముడతలు ఏర్పడతాయి వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

స్మోకింగ్ & డ్రింకింగ్
చర్మంపై ముడుతలను ఏర్పరచటంలో స్మోకింగ్ మొదటగా ఉంటుంది. సిగరెట్ లలో ఉండే నికోటిన్ రక్తనాళాలను సన్నగా మారటం వలన చర్మ ఉపరితలపై పొరకు రక్త పంపిణీ, పోషకాలు మరియు ఆక్సిజన్ అందటం కష్టతరం అవుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కొల్లాజన్ అవసరం కానీ పొగతాగటం వలన కొల్లాజన్ ప్రమాదానికి గురవుతుంది.

ఆల్కహాల్ సేకరణ అనేది పూర్తి ఆరోగ్యానికి హానికరం, ఇది చర్మ కణాలను కూడా ప్రమాదానికి గురి చేస్తుంది. మితిమీరిన స్థాయిలో ఆల్కహాల్ తాగటం వలన ముఖ చర్మ రంగు మారటం, చర్మ కండరాల బలహీనంగా మారటం మరియు రక్త నాళాలు పగలటం లేదా సన్నని రక్తనాళాలు బహిర్గతం అవటం వంటి సమస్యలు కలిగి, చర్మం ముడతలకు గురవుతుంది.

నిద్రలేమి
నిరంతరంగా నిద్రలేమి సమస్యలు చర్మంపై ముడతలతో పాటూ, చర్మం సాగటం వంటివి కలగవచ్చు. రాత్రి సమయంలో గాఢ నిద్ర వలన గ్రంధులు స్వచ్చంగా మరియు మెదడు నుండి పెరుగుదల హార్మోన్ (గ్లోత్ హార్మోన్) అధికంగా విడుదల చేయబడుతుంది. ఈ హార్మోన్ చర్మ కణాలతో పాటూ శరీరంలో అన్ని కణాలను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. మంచి నిద్ర చర్మంపై ఏర్పడే ముడతలను ఆలస్యపరుస్తుంది.

ఒత్తిడి
రోజు- రోజు అనుభవించే ఒత్తిడి మరియు టెన్షన్ లను ఆ రోజే మర్చిపోవటం మంచిది, ఎందుకంటే, తీవ్రమైన ఒత్తిడి మరియు టెన్షన్ లు మనం ముఖ చర్మంపై వృద్దాప్యంగా బహిర్గతం అవుతుంది. దీర్ఘకాలిక సమయం పాటూ ఎదురయ్యే ఒత్తిడి మరియు టెన్షన్ లు శరీరంలో కార్టిసాల్ మరియు అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ లు అధికంగా విడుదల అవుతాయి. ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని ప్రభావిత పరచి, చర్మం సాగేలా చేసి, అకాల వృద్దాప్యానికి కారణం అవుతాయి.

పోషకాల కొరత
మనం తీసుకునే ఆహరం చర్మంపై ఏర్పడే ముడతలు మరియు వృద్దాప్య లక్షణాలను ప్రభావిత పరుస్తుంది. ఆహార పదార్థాలు చర్మంలో ఉండే యవ్వన కణాలను గాయపరచి, మీరున్న వయసు కన్నా ఎక్కువ వయసు గల వారిలా కనపడేలా చేస్తుంది. అధిక కొవ్వు గల ఆహారాలు, చక్కెరలు, సంవిధాన పరచిన ఆహారాలు మరియు తక్కువ తాజ పండ్లు మరియు కూరగాయలు శరీర అంతర్గత శరీర వాతావరణాన్ని ప్రభావిత పరుస్తాయి. అధిక మొత్తంలో చక్కెరలు, ముఖ్యంగా సంవిధాన పరచిన ఆహారాలు కొల్లాజన్ ను గాయపరుస్తాయని అధ్యయనాలలో దృవీకరించబడింది. విటమిన్ కొరత ఉండే వారిలో కూడా చర్మ ముడతలు ఎక్కువగా కలుగుతాయి. కావున మంచి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను తినటం వలన వృద్దాప్యాన్ని ఆలస్యపరచవచ్చు. అంతేకాకుండా, యాంటీ ఆక్సిడెంట్ లను అధికంగా కలిగి ఉండే ఆహారాలు వృద్దాప్యాన్ని ప్రేరేపించే కారకాలకు వ్యతిరేఖంగా పోరాడతాయి.

Disclaimer +
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి MMS DESIGNER (Health tips) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్’లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా video lo ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

http://ift.tt/1OebDcO

The post how to reduce wrinkles on face naturally in telugu appeared first on Vitamin C Serum Store.

No comments:

Post a Comment